వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద ఆధార సహితంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రఘురామ రాజు ఎవరెవరితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అన్నది వివరించింది. దీనికంతటికీ ఆధారం రాజు గారి ఫోన్. ఆయన ఫోన్ ని అప్పట్లో స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు లోతుపాతులన్నీ కూడా దర్యాప్తు చేసి మరీ రాజు గారి గుట్టు బయటపెట్టేశారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ఇక చంద్రబాబు లోకేష్ లతో వాట్సప్ సంభాషణలు రాజు జరిపేవారు అని కూడా కనిపెట్టారు.