గుడ్‌గావ్‌లోని ఓ కార్ల అమ్మకాల సంస్థ సీఈవో లియాకత్ బచావ్ ఖాన్‌తోపాటు నిపుణ్ మిగ్లానీ, సురియా అర్జునన్ ఈ కార్ల స్కామ్‌కు తెరతీశారు. ఇలా లేటేస్టుగా ఓ కారు వస్తుందని సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వలపన్ని వారిని పట్టుకున్నారు. ఆ తరవాత వాళ్లను పట్టుకుని నాలుగు తగిలిస్తే.. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇలా చాలా మందికి పన్ను ఎగ్గొట్టేలా కార్లు ఇప్పించామని చెప్పారు. ఇంకే ముందు ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ సెలబ్రెటీలను పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారట.