ఇవాళ బక్రీద్.. రొటీన్ గా శుభాకాంక్షలు చెబితే ఏం బావుంటుందనుకున్నాడో ఏమో.. కమెడియన్ సునీల్ కాస్త వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాడు. ముస్లింల తరహాలో టోపీ పెట్టుకుని.. మెడలో తాయెత్తు కట్టుకుని.. పచ్చగళ్ల కండువా మెడలో వేసుకుని ఓ ఫోటో పెట్టి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అని ఫేస్ బుక్లో పోస్టు పెట్టాడు. దీంతో ఇక నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హిందూ వాదులు సునీల్ మరీ ఓవర్ చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.