పంజాబ్ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి నేటి వరకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ ఉత్కంఠకు తెరదించుతూ సోనియా గాంధీ మాజీ ఇండియన్ క్రికెటర్ మరియు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దుని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించింది.