విడదల రజిని....అధికార వైసీపీలో మంచి క్రేజ్ ఉన్న ఎమ్మెల్యే. ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి, సీనియర్ నాయకుడుని ఓడించి, ఎమ్మెల్యేగా గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మామూలుగా చిలకలూరిపేటలో టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించడం వైసీపీకి అసాధ్యమని గత ఎన్నికల్లో ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి టికెట్ దక్కించుకుని, జగన్ వేవ్‌లో రజిని, పేట బరిలో విజయం సాధించారు.