మూడు రాజధానుల అంశం లేకపోతే ఏపీ రాజకీయాల్లో విశాఖపట్నం పెద్దగా హైలైట్ అయ్యేది కాదనే చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం వచ్చాక, మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించడంతోనే అక్కడ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అయితే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌తోనే విశాఖలో టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయోచ్చని వైసీపీ భావించింది.