కేంద్రం ఉచిత సరకుల్ని ఇచ్చే వేళ, అన్ని రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టారు. తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో ఆఫీస్ ల వద్ద కూడా ఈ ఉచిత రేషన్ పబ్లిసిటీ పెంచారు. మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం సజావుగా సాగుతున్నా, ఏపీలో మాత్రం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని నెలలుగా రేషన్ డీలర్లు సరకుల పంపిణీ ఆపేశారు. ఈ క్రమంలో డీలర్లకు మరోసారి కేంద్ర ప్రభుత్వం పని కల్పించింది. రేషన్ పంపిణీ చేయాలని ఆదేశించింది.