కేటీఆర్ తన పుట్టినరోజు జూలై 24 సందర్భంగా అవసరం ఉన్న దివ్యాంగులకు స్కూటీ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం వంద మంది వికలాంగులకు స్కూటీ లు ఇవ్వాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన జన్మదిన సందర్భంగా అవసరం ఉన్నవారికి వ్యక్తిగతంగా సహాయం అందించాలని ...ముక్కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటాలని టిఆర్ఎస్ నేతలకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.