వారసత్వ రాజకీయాల్లో ఏపీ ముందువరుసలో ఉంటుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రతి నాయకుడు, తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలనే చూస్తారు. అలాగే వైఎస్సార్ వారసుడుగా వచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అటు చంద్రబాబు వారసుడు నారా లోకేష్ సైతం రాజకీయాల్లో దూకుడుగా ఉన్నారు. ఇలా ఏపీలో చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో పలువురు వారసులు ఎన్నికల బరిలో కూడా దిగారు.