తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ రేంజ్లో దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. పీసీసీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి, అధికార టీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ఇతర పార్టీల నుంచి నాయకులని తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.