అధికార పార్టీలో ఉంటే నాయకులకు ఏదొక పదవి తప్పనిసరిగా వస్తుందనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులకు పదవుల పంపకాలు జరుగుతాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అదే కార్యక్రమం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలకు పదవుల పండగ నడుస్తోంది. ఇటీవల కూడా నామినేటెడ్ పదవులని భర్తీ చేశారు. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లని నియమించారు.