తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని, ఇక్కడ ప్రజలకు అండగా ఉండటానికే పార్టీ పెడుతున్న అని చెప్పి దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా పార్టీ పెట్టిన ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా రాజకీయాలు చేస్తూ, అధికార టీఆర్ఎస్పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.