తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏపీలో కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ వర్షాలు కొత్త తిప్పలు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల విషయంలో టీడీపీ విమర్శలతోనే సరిపెట్టింది. ఇప్పుడు నీట మునిగిన జగనన్న కాలనీలను చూపించి మరింతగా విమర్శల డోసు పెంచుతోంది.