కరోనా కష్టకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా 500కోట్ల రూపాయలు సమీకరించారు. ఇంకా ఏదో చేయాలనుకుంటున్న అధికారులు ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు.