పొలిటికల్‌గా ఎప్పుడూ.. దూకుడుగా ఉండే.. టీడీపీ నేతలు.. ఓ విషయంలో మాత్రం ఫుల్లు సైలెంట్ పాటించారనే వాదన వినిపిస్తోంది. అది కూడా ఏపీ సర్కారుకు చెందిన కీలక విషయమే కావడంతో ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ``అసలేం జరిగింది? ఆ విషయంపై ఒక్్రంటే ఒక్కరు కూడా మాట్లాడరేంటి?`` అనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులుకేసు నమోదు చేయడం తెలిసిందే. అదేసమయంలో ఆయన జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. కోర్టులో కేసు దాఖలుచేశారు. ఈ క్రమంలో ఈకేసును సుప్రీం కోర్టు విచారణకు తీసుకుంది.