ఏ పార్టీ అధినేత అయినా, తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం గానీ, విడిపోవడం గానీ చేస్తారు. తన పార్టీకి ఎలా అయితే బెనిఫిట్ జరుగుతుందో అలా ముందుకెళ్తారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అలాగే ఎప్పుడు ముందుకెళుతుంటారు. ఈయన రాజకీయ జీవితంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు...అదేవిధంగా పొత్తు నుంచి బయటకొచ్చారు. ముఖ్యంగా ఈయన, బీజేపీతో ఎన్నిసార్లు కలిశారో, ఎన్నిసార్లు విడిపోయారో కూడా తెలిసిందే.