హుజూరాబాద్ ఉపఎన్నిక...ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ ఈ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక బరిలో ఎవరు గెలుస్తారని తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు ఉపఎన్నిక షెడ్యూల్ రాక ముందే అక్కడ ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇక్కడ పార్టీల కంటే వ్యక్తిగతంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోరు జరుగుతుందని చెప్పొచ్చు.