ఏపీలో మంత్రివర్గంలో జరగబోయే మార్పులపై ఆసక్తికర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి జరిగే మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్ ఎవరికి షాక్ ఇచ్చి, ఎవరికి బంపర్ ఆఫర్ ఇస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. అయితే జగన్ క్యాబినెట్ నుంచి సగంపైనే మంత్రులు బయటకు రావడం గ్యారెంటీ అని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యువ మంత్రి, జగన్తో ఎంతో సన్నిహితంగా ఉండే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం, క్యాబినెట్ నుంచి బయటకు వస్తారని సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.