ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు ఏం ఎన్నికలబ్బా అనుకుంటున్నారా.. ఇటీవల వైసీపీ సర్కారు పురపాలికల్లోనూ రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్లను నియమించాలని భావించింది. పార్టీ తరపున ఆశావహులైన నాయకులు ఎక్కువగా ఉండటంతో వారి కోసం వైసీపీ సర్కారు ఈ ఎత్తుగడ వేసింది.