ఏ పార్టీ అయినా పుంజుకోవాలంటే.. ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. ఆయా పార్టీలు ముందుకు సాగుతాయి. నిరంతరం ప్రజలతో టచ్లో ఉండడం. వారి సమస్యలు తెలుసుకుని.. వాటి పరిష్కారానికి కృషి చేయడం.. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడం.. వంటివి.. ఏ పార్టీ అయినా.. చేసే పని. తద్వారా .. ప్రజాభిమానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అదేసమయంలో పార్టీ సభ్యత్వాల ద్వారా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, ఘనత వహించిన బీజేపీ మాత్రం ప్రజలను కాకుండా.. ఏపీ సర్కారులోని కొందరు మంత్రులను టార్గెట్ చేసుకుంది. గడిచిన కొన్నాళ్లుగా బీజేపీ పరిస్థితిని గమనిస్తే.. ఇదే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.