రాయలసీమ జిల్లాల్లో అధికార వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి సీమలో ఉన్న జిల్లాల్లో వైసీపీ సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో అధికారం రాకపోయినా సరే సీమలో వైసీపీకే మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన పని లేదు. దాదాపు క్లీన్‌స్వీప్ చేసేసింది. సీమలో ఉన్న నాలుగు జిల్లాలో కలిపి 52 అసెంబ్లీ సీట్లు ఉంటే, వైసీపీ ఏకంగా 49 గెలుచుకుంటే, టీడీపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. ఇక ఉన్న 8 పార్లమెంట్ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.