సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశంలో ఉండే కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి గత ఎన్నికల్లో జగన్ సైతం అదే వర్గానికి చెందిన నాయకులని ఎమ్మెల్యేలుగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే వినుకొండలో టీడీపీ నేత జివి ఆంజనేయులుపై, బొల్లా బ్రహ్మనాయుడుని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో టీడీపీ బలంగా ఉన్న వినుకొండలో బొల్లా ఎమ్మెల్యేగా గెలిచారు.