మీరాబాయి చానుకు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. భారత సత్తాను ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజరానా ప్రకటించింది. మీరాబాయి చానుకు రూ. కోటి రూపాయల నజరానా అందించనున్నట్టు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ స్వయంగా ప్రకటించారు. అసాధారణ ప్రతిభతో పతకం సాధించిన మీరాబాయికి రూ.కోటి నజరానాతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా మణిపూర్ సీఎం ప్రకటించారు.