ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. పై నుంచి ప్రవాహం వస్తున్న తీరు చూస్తే.. ఈ ఏడాది కూడా సాగు, తాగు నీటి కష్టాలు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి దాదాపు 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 860 అడుగుల వరకూ చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ వంద టీఎంసీలకు చేరుకుంది.