జాబ్ క్యాలెండర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ మంత్రులు ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. మీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారంటూ లెక్కలడిగారు. సచివాలయాలు ఏర్పాటు చేసి, ఉద్యోగాలిస్తే యువతను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఆ తర్వాత ఏపీపీఎస్సీ భర్తీ చేసే పోస్ట్ ల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలతో వీటికి మరింత బలం చేకూరింది.