దళితబంధు పథకంపై కేసీఆర్ స్వయంగా ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి దళిత బంధు అవగాహన సదస్సు జరగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఈ అవగాహన సదస్సుకు నలుగురిని ఆహ్వానించారు.