పోలీసులంతా ఉద్యోగాల్లో చేరేముందు ఫిట్ గానే ఉంటారు. పోలీసు ట్రైనింగ్ లో మరింత దృఢంగా తయారవుతారు. అయితే ఆ తర్వాత కొలువులో చేరాక అసలు సమస్య మొదలవుతుంది. రోజువారీ విధుల్లో ఫిట్ నెస్ పై దృష్టిపెట్టడం తగ్గిపోతుంది. ఫలితంగా చాలామంది బరువు పెరిగిపోతున్నారు. ఒబెసిటీ బారినపడుతున్నారు. కరోనా కాలంలో సామాన్యులతోపాటు, పోలీసు విభాగంలో కూడా చాలమంది కష్టాలు పడ్డారు. శ్వాస సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇలాంటి సమస్యలు అధిగమించడానికి ఇప్పుడు పోలీసులకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలు కాబోతోంది.