లంచం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుంది. ఏసీబీ కేసులు ఎదుర్కొన్న చాలామంది ఆ తర్వాత హాయిగా ఉద్యోగాల్లో చేరిపోయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. లంచం తీసుకున్నా ఎలాగోలా బయటపడిపోవచ్చనే ధైర్యంతోనే చాలామంది ఆ పాడుపనికి పూనుకుంటారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల మెడపై మరో కత్తి వేలాడదీసేందుకు రెడీ అయింది కేరళ ప్రభుత్వం. కట్నం తీసుకుంటే ఉద్యోగంనుంచి తొలగించేలా ఒప్పందాలు తయారు చేస్తోంది.