తెలంగాణ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న ఇష్యూ ఏమన్నా ఉంది అంటే...అది హుజూరాబాద్ ఉపఎన్నిక గురించే. ఊహించని విధంగా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి, హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడ్డారు. అలాగే పార్టీ మారిన వారు నైతికంగా పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని మంచి సందేశం కూడా ఇచ్చారు.