తాజాగా వచ్చిన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 50 వార్డులున్న ఈ కార్పొరేషన్లో వైసీపీ గుండుగుత్తుగా 47 డివిజన్లు సొంతం చేసుకుంది. కేవలం 3స్థానాల్లో మాత్రమే టీడీపీ పుంజుకుంది. ఇది నిజానికి టీడీపీ గతపాలన తర్వాత.. తగిలిన పెద్ద ఎదురు దెబ్బగానే చెబుతున్నారు పరిశీలకులు. దీనిని సాధారణంగా.. ఏదో అధికారంలో ఉన్న పార్టీ గెలిచిందిలే.. అని సరిపెట్టుకుని.. చేతులు దులుపుకొనే పరిస్థితిగా చూడకూడదనే వాదన వినిపిస్తోంది.