ఆ మహిళా ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచారు...అయినా సరే మంచి క్రేజ్ తెచ్చుకుని ఏపీ రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. అదే సమయంలో వారి చుట్టూ వివాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అదే అంశం వారికి నెగిటివ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలా నెగిటివ్ అంశాలు కాస్త ఎక్కువగా ఉన్న లేడీ ఎమ్మెల్యేలు ఎవరో కాదు...తొలిసారి తాడికొండలో గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరిపేటలో గెలిచిన విడదల రజిని, శింగనమలలో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిలు.