నాడు - నేడు పథకం కోసం ఓ సాఫ్ట్ వేర్ కూడా రూపొందించి.. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ప్రఖ్యాత టీసీఎస్ సంస్థతో ఈ సాఫ్ట్ వేర్ తయారు చేశారు. ఈ సాఫ్ట్వేర్ వాడకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన.. విద్యార్థుల పర్యవేక్షణ చాలా సులభంగా నాణ్యంగా జరుగుతోంది. క్రమంగా ఈ పథకం గురించి తెలుసుకున్న తెలంగాణ అధికారులు తాము కూడా ఆ సాఫ్ట్వేర్ వాడుకోవాలని నిర్ణయించారు.