అవును మరి జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రారు. అదే సమయంలో ఆయన పార్టీకి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా నోరు మెదపరు. అపుడు అబద్ధమే నిజం అవుతుంది. విశాఖలో ఈ మధ్య అతి పెద్ద దుమారమే చెలరేగింది. అదేంటి అంటే విశాఖ బీచ్ తీరం వద్ద ఉన్న అలనాటి ప్రముఖ నిర్మాతకు చెందిన రామానాయుడు స్టూడియోను ప్రభుత్వం బలవంతంగా తీసేసుకుంటుంది అని. దీని మీద టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు ప్రచురించి మరీ జనాలను అటు సినీ వర్గాలను గందరగోళంలోకి నెట్టేశారు. దాంతో విశాఖలో ఏ ఒక్క ప్రైవేట్ స్థలం మిగలనీయరు అంటూ తమ్ముళ్ళ విమర్శలు కూడా మొదలైపోయాయి.