ఏపీలో క్యాబినెట్లో 25 మంత్రులు ఉన్నారనే విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని దూసుకెళుతున్న జగన్‌కు మంత్రులు ప్లస్ అవుతున్నారా? అంటే కరెక్ట్‌గా ఏది చెప్పలేని పరిస్తితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేయగా, ఈ రెండేళ్లలో ఎంతమంది అదిరిపోయే పనితీరు కనబరుస్తూ, ప్రజలకు సేవ చేస్తూ, సీఎం జగన్‌కు అండగా ఉంటూ, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు? అంటే ఏదో కొద్దిమంది మాత్రమే మంచి పనితీరు కనబర్చారని చెప్పొచ్చు.