జిల్లాలకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను పెట్టి పని విభజన చేసినా సచివాలయాల తనిఖీ వ్యవహారాన్ని మాత్రం అందరికీ అప్పగించింది ప్రభుత్వం. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు.. ఇలా అందరూ గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాల్సిందే. వారంలో కొన్నిరోజులు ఈ తనిఖీలు తప్పనిసరి. ఇప్పుడీ తనిఖీల వ్యవహారం నత్తనడకన సాగుతోందని సీఎం జగన్ అధికారులకు మెమోలు జారీ చేస్తున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ తనిఖీలతో అసలు పని ముందుకు సాగడంలేదనే వారు కూడా ఉన్నారు.