తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ...దళితులు... ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనన చాలా బాగుందన్నారు. కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెడ్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికి పదిలక్షలు ఇస్తేనే కేసీఆర్ దళిత బంధువు అవుతారంటూ వీహెచ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం తీసి దళిత , బహుజనులకు ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబెడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్ లో పెట్టందని వీహెచ్ మండిపడ్డారు.