ఐఐటీ, ఐఐఎంలలో తమ పిల్లలను చదవాలని ఆశపడే తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. అయినా సరే.. ఖర్చుకు వెనుకాడని తల్లిదండ్రులను కొన్ని విద్యాసంస్థలు నిలువునా దగా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని అలాంటి ఓ సంస్థకు వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది.