రష్యా ఆటగాళ్లు రష్యా పేరుపై కాకుండా రష్యన్ ఒలింపిక్ కమిటీ పేరుతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాని తరుపున ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అందుకే ఇప్పుడు రష్యా ఆటగాళ్లు ROC పేరుపై ఆటల్లో పాల్గొంటున్నారు. ఈ కారణంతో రష్యా పేరు మాత్రం ఒలింపిక్స్ లో వినిపించడం లేదు. నిషేధం కారణంగా రష్యా పేరు కానీ.. పతాకం కానీ రష్యా ఆటగాళ్లు వాడేందుకు వీలు లేదు.