జమ్మూ, హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు భీబత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా వరదల భీబత్సానికి మరో 16 మంది మృతి చెందారు. అంతే కాకుండా పలువురు గల్లంతు అయ్యారు. అంతే కాకుండా ఆకస్మిక వరదల కారణంగా ఇళ్లు, పంటలు సైతం ధ్వంసమయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. హిమాచల్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో ఏడుగురు గల్లంతయ్యారని సమాచారం. మరోవైపు ఉదయ్‌పుర్ ప్రాంతంలో 12 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. కాగా వారిలో ఏడు గురి మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి.