తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? అక్కడ టీఆర్ఎస్ని ఓడించాలంటే రేవంత్ ఏం చేయాలి? అంటే ప్రస్తుతానికి హుజూరాబాద్‌లో రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహాలు ఏమి వేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా పీసీసీ పదవి వచ్చిన మొదట్లోనే హుజూరాబాద్ ఉపఎన్నిక తన సామర్ధ్యానికి పరీక్ష కాదని చెప్పేశారు.