పులివెందుల నియోజకవర్గం....ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది వైఎస్సార్ ఫ్యామిలీనే. పులివెందుల అంటే వైఎస్సార్ కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి దివంగత వైఎస్సార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు, వైఎస్.పి. రెడ్డి ఒకసారి, వైఎస్ విజయమ్మ ఒకసారి విజయం సాధించారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీలతో గెలిచారు.