కింద పడిన పైచేయి మాదే అనే తీరుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న పార్టీని బలోపేతం చేయడం కంటే, ఎప్పుడు జగన్ని తిట్టడంపైనే ఫోకస్ చేస్తున్నారని చెప్పొచ్చు. అచ్చెన్నకు ఇది తప్ప వేరే పని ఉన్నట్లు కనిపించడం లేదు. ఏది ఎలా జరిగిన ప్రతిరోజూ జగన్పై విమర్శలు చేయాలి. అలాగే చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించాలి. అసలు గతంలో తాము గొప్పగా పాలించమని, ఇప్పుడు జగన్ వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పాలి.