కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే. ఆనాడు కాంగ్రెస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఎన్టీఆర్, తెలుగుదేశం స్థాపించారు. అలాగే కాంగ్రెస్‌ని పలుమార్లు దెబ్బకొడుతూ వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత టీడీపీ బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు సైతం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే రాజకీయాలు చేశారు.