ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మరోసారి టిడ్కో ఇళ్ల వ్యవహారం హైలెట్ అయింది. టిడ్కో ఇళ్లకోసం జరిపిన రివర్స్ టెండరింగ్ లో రూ.480కోట్లు ఆదా అయిందని దీనిపై టీడీపీ అనుకూల మీడియా వార్తలు రాయదని ఆయన మండిపడ్డారు. 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు రూపాయికే ఇస్తామని, 365, 430 చదరపు అడుగుల ఇళ్లకోసం మౌలిక సదుపాయాలు సమకూర్చుతున్నామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.