1984 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాకు ఈనెల 31తో పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను తీసుకొచ్చి కీలకమైన ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. ఢిల్లీ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే ఈ తతంగం జరిగిపోయింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. నాలుగు రోజుల పదవీకాలం ఉన్న వ్యక్తిని ఢిల్లీ పోలీస్ బాస్ గా ఎందుకు నియమించారంటూ ప్రశ్నించారు నేతలు. కేంద్రం సమాధానం చెప్పకపోయే సరికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. మాకీ పోలీస్ బాస్ వద్దు అంటూ ఆయన నియామకాన్ని వ్యతిరేకించారు.