సెక్స్ వర్కర్లు మరియు అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమైక్య విముక్తి మరియు హెల్ప్ సంస్థ తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సెక్స్ వర్కర్లు నిరసనకు దిగారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ...సెక్స్ వర్కర్ల ఇబ్బందులను ఆసరా చేసుకుని తమకు రుణాలను ఇచ్చి బలవంతంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.