రేపు ఎల్లుండి లాల్ దర్వాజ భోనాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఫలక్ నుమా, ఇంజన్ బౌలి నుండి వచ్చే వాహనాలు అలియాబాద్ నుండి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాలని సూచించారు. కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్ లో ట్రాఫిక్ ను అనుమతించరని తెలిపారు. ఓల్డ్ చత్రినాక మీదుగా గొలిపురా వైపు వాహనాలను మళ్లిస్తారన్నారు. ఉప్పుగూడ నుండి ఛత్రినాక వైపు నుండి వచ్చే వాహనాలను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుండి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారని తెలిపారు. మీరా కా దయార మొఘలురా నుండి హరిబౌలి క్రాస్ కు వచ్చే ట్రాఫిక్ ను వాటర్ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారని చెప్పారు. చార్మినార్ మెయిన్ రోడ్, అస్రా హాస్పిటల్ నుండి వచ్చే ట్రాఫిక్ ను మొఘల్ పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారని తెలిపారు. లాల్ దర్వాజ టెంపుల్ ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్ లు ఉంటాయన్నారు.