తెలంగాణ రాష్ట్రం లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియెంట్ మన దేశంతో పాటూ మొత్తం 130దేశాల్లో చాలా ఇబ్బందులు పెట్టిందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మన పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో యాబై శాతం కేసులు కేరళ లోనే నమోదు అవుతున్నాయని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయని.. కానీ లక్షణాలు మైల్డ్ గా ఉంటున్నాయని చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ వేరియంట్ లు కూడా దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయని శ్రీనివాసరావు చెప్పారు.