రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిషత్ ఎన్నికలను నిర్వహించినప్పటికీ.. అత్యంత కీలకమైన.. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న గుంటూరు పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరిగినా ఫలితం మాత్రం రాలేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అవకాశం ఉన్నప్పటికీ.. వైసీపీ సర్కారు కానీ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ.. ఈ విషయంలో జొక్యం చేసుకోవడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ఏంటనేది అంతుబట్టడం లేదని చెబుతున్నారు. గుంటూరు పరిషత్ ఎన్నికల ఫలితాల విషయంలో ఇటు ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విదానంపై విమర్శలు మాత్రం వస్తున్నాయి.