ఏపీలో ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏది కలిసి రావడం లేదనే సంగతి తెలిసిందే. మొదటలో జనసేన పార్టీ పోటీ చేయకపోయినా, ఆ పార్టీ మద్ధతుతో టీడీపీ-బీజేపీలు అధికారంలోకి రాగలిగాయి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. సరే ఇలా ఓటమి పాలయ్యాక జనసేన ఏమన్నా పుంజుకునే పరిస్తితి ఉందా? అంటే అసలు పుంజుకున్నట్లు కనిపించడం లేదు.